Anasuya: కొందరికి శిక్ష పడితేనే ఇలాంటివి చేయడానికి భయపడతారు: అనసూయ

  • తన ఫొటోలు మార్ఫింగ్ చేస్తున్నారంటూ అనసూయ ఆగ్రహం
  • ట్విట్టర్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు
  • ఇలాంటివాళ్లపై చర్యలు తీసుకోకపోతే రేపటి క్రిమినల్స్ అవుతారని ఆందోళన

తన ఫొటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని, తన పట్ల అసభ్యపదజాలం ఉపయోగిస్తున్నారని ప్రముఖ యాంకర్, సినీ నటి అనసూయ మండిపడుతోంది. దీనిపై ఇప్పటికే ఆమె ట్విట్టర్ ద్వారా పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. తాజాగా స్పందిస్తూ, కొందరికి శిక్ష పడితేనే మిగతావాళ్లు ఇలాంటివి చేయడానికి భయపడతారని అభిప్రాయపడింది. ఇలాంటి పాడుపనులు చేయాలన్న ఆలోచన రావాలంటేనే భయపడేలా దండించాలని సూచించింది. ఎలాంటి చర్యలు తీసుకోకపోతే 10 మంది 100 మంది అవుతారని, వాళ్లే రేపు ఆడవాళ్ల మీద అఘాయిత్యాలు చేసే క్రిమినల్స్ అవుతారని అనసూయ అభిప్రాయపడింది.

Anasuya
Anchor
Actress
Morphing
Police
  • Loading...

More Telugu News