Jagan: జస్టిస్ జయచంద్రారెడ్డి మృతికి సీఎం జగన్ సంతాపం

  • సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జయచంద్రారెడ్డి కన్నుమూత
  • ట్విట్టర్ లో స్పందించిన సీఎం జగన్
  • జయచంద్రారెడ్డి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి

సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కె.జయచంద్రారెడ్డి మృతి పట్ల సీఎం జగన్ సంతాపం తెలియజేశారు. జస్టిస్ జయచంద్రారెడ్డి మహోజ్వల వ్యక్తిత్వం కలిగినవారని, లా కమిషన్ చైర్మన్ గా, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ గా ఆయన అందించిన సేవలు విలువైనవని కీర్తించారు. భారత న్యాయవ్యవస్థలో ఆయన భాగస్వామ్యం ఎన్నదగినదని పేర్కొన్నారు. ఈ విషాద సమయంలో జయచంద్రారెడ్డి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్టు ట్వీట్ చేశారు.

Jagan
Justice Jayachandra Reddy
Demise
Supreme Court
  • Loading...

More Telugu News