Corona Virus: 'కరోనా వైరస్'పై వార్తలను సేకరిస్తోన్న జర్నలిస్టు అదృశ్యం

  • వూహాన్ నగరం నుంచి రిపోర్టింగ్ చేస్తున్న జర్నలిస్టు
  • అదుపులోకి తీసుకున్న పోలీసులు?
  • గురువారం రాత్రి నుంచి కనపడకుండాపోయిన వైనం

చైనాతో పాటు ప్రపంచంలోని చాలా దేశాలను కరోనా వైరస్ వణికిస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా గురించిన పలు విషయాలను చైనా దాచి పెడుతోందని ప్రచారం జరుగుతోన్న సమయంలో ఓ జర్నలిస్టు కనపడకుండా పోవడం చర్చనీయాంశమైంది.

కరోనా వైరస్ అధికంగా ఉన్న వూహాన్ నగరంలోనే ఉంటూ ఎప్పటికప్పుడు రిపోర్టింగ్ చేస్తోన్న ఇద్దరు చైనా జర్నలిస్టుల్లో ఒకరైన ఛెన్ కియుషి అదృశ్యమయ్యాడు. ఆయన ఇచ్చిన వార్తలు సామాజిక మాధ్యమాల్లోనూ అధికంగా కనపడేవి. ప్రస్తుతం ఆయన ఏమయ్యాడో తెలియడం లేదు.

వూహాన్‌ నుంచి కరోనా వార్తలపై వాస్తవ పరిస్థితులను రిపోర్ట్ చేస్తుండడంతో అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. కరోనా మృతులకు సంబంధించిన ఓ వీడియోను పోస్ట్ చేయడంతో అతడిపై కఠినంగా వ్యవహరించినట్టు సమాచారం. గురువారం రాత్రి ఏడు గంటల నుంచి అతడు కనబడడం లేదని అతని స్నేహితులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News