Adireddy Bhavani: అసభ్య కామెంట్లు.. దిశ పోలీస్ స్టేషన్లో టీడీపీ మహిళా ఎమ్మెల్యే ఫిర్యాదు

  • ఆదిరెడ్డి భవానీపై సోషల్ మీడియాలో అసభ్యకర కామెంట్లు
  • రాజమండ్రి దిశ పీఎస్ లో ఫిర్యాదు చేసిన భవానీ
  • కామెంట్లు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని విన్నపం

సోషల్ మీడియాలో కొందరు తనపై అసభ్యకర కామెంట్లు పెడుతున్నారంటూ రాజమండ్రిలోని దిశ పోలీస్ స్టేషన్ లో టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ ఫిర్యాదు చేశారు. ఇలా కామెంట్లు పెడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో ఆమె కోరారు. ఈ సందర్భంగా భవానీతో పాటు టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత, ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు సహా పలువురు టీడీపీ నేతలు, మహిళా కార్యకర్తలు పోలీస్ స్టేషన్ కు వచ్చారు. రాజమండ్రిలో దిశ పోలీస్ స్టేషన్ ను ముఖ్యమంత్రి జగన్ ఇటీవల ప్రారంభించిన సంగతి తెలిసిందే.

Adireddy Bhavani
Telugudesam
Social Media
  • Loading...

More Telugu News