Mahesh Babu: ఇది ప్రతి అమ్మాయి కల... నా జీవితంలో నిజమైంది: నమ్రతా శిరోద్కర్

  • నీ స్వచ్ఛమైన ప్రేమతో నా జీవితం నిండిపోయింది
  • అద్భుతమైన ప్రపంచాన్ని అందించావు
  • ఇన్ స్టాగ్రామ్ లో నమ్రత

టాలీవుడ్ సెలబ్రిటీ జంటల్లో మహేశ్ బాబు, నమ్రతా శిరోద్కర్ ల పేర్లు ముందుంటాయనడంలో సందేహం లేదు. ఈ జంటకు వివాహమై నేటికి 15 సంవత్సరాలు కాగా, నమ్రత, తన ఇన్ స్టాగ్రామ్ లో పెట్టిన ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. ప్రతి అమ్మాయీ కనే కల లాంటి ప్రపంచం తన కళ్ల ముందుందని చెప్పింది.

"ప్రతి యువతీ కలలుగనే ఓ అద్భుతమైన ప్రపంచాన్ని నాకు అందించావు. నా జీవితమంతా నీ స్వచ్ఛమైన ప్రేమతో, ముద్దులొలికే మన ఇద్దరు పిల్లలతో నింపేశావు. నీ ప్రేమానురాగాలతో మన ఇల్లు ఎప్పుడూ నందనవనమే. నీ సాహచర్యం నాకెప్పుడూ ఉంటేచాలు. నాకు ఇంతకన్నా ఏం కావాలి?. నా ప్రియాతి ప్రియమైన మహేశ్‌ కు 15వ మ్యారేజ్ డే శుభాకాంక్షలు’ అని ఇన్‌ స్టాగ్రామ్‌ లో నమ్రత పోస్ట్ చేసింది. ఇక ఈ పోస్ట్ కు తమ వివాహం జరిగినప్పటి కొత్తల్లో తీసుకున్న పిక్ ను ఆమె జోడించడంతో, ఈ పోస్ట్ వైరల్ అయింది.

Mahesh Babu
Namrata
Instagram
Post
Marriage Day
  • Loading...

More Telugu News