Anasuya: అసభ్యకరంగా కామెంట్ చేస్తున్నారంటూ.. పోలీసులకు ట్విట్టర్ ద్వారా అనసూయ ఫిర్యాదు!

  • సోషల్ మీడియాలో కామెంట్లు
  • ఫొటోలను మార్ఫింగ్ చేస్తున్నారు
  • సైబర్ క్రైమ్ అధికారులకు అనసూయ ఫిర్యాదు

సామాజిక మాధ్యమాల వేదికగా, కొందరు పనిగట్టుకుని తనపై అసభ్యకరంగా కామెంట్లు చేస్తూ వేధిస్తున్నారని ప్రముఖ నటి, యాంకర్ అనసూయ, హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేసింది. ఇటీవల కొంత కాలంగా తన చిత్రాలను మార్ఫింగ్ చేసి అప్ లోడ్ చేస్తున్నారని కూడా ఆమె పేర్కొంది.

తన సోషల్ మీడియా ఖాతాలకు వచ్చిన కామెంట్లను జతచేస్తూ, అనసూయ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా, ఇటీవలి కాలంలో అనసూయ న్యూడ్ ఫొటో అంటూ, ఓ చిత్రం హల్ చల్ చేయగా, అది తన చిత్రం కాదని వివరణ ఇస్తూ, ఒరిజినల్ చిత్రాన్ని ఆమె విడుదల చేసిన సంగతి తెలిసిందే.

Anasuya
Cyber Crime
Police
Complaint
  • Loading...

More Telugu News