Vijay Sai Reddy: జీవీఎల్ కు మద్దతుగా విజయసాయి రెడ్డి వ్యాఖ్యలు!

  • రాజధాని రాష్ట్ర పరిధిలోనిదే
  • కేంద్రం ఇప్పటికే వివరణ ఇచ్చేసింది
  • జీవీఎల్ పై ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోందన్న విజయసాయి

ఏ రాష్ట్ర రాజధాని ఎక్కడుండాలన్న విషయం ఆ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిదేనని కేంద్రం స్పష్టం చేస్తున్నా, ఎల్లో మీడియా మాత్రం, ఆ విషయంపై వివరణ ఇచ్చిన బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావుపై దుష్ప్రచారం చేస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ ను పెడుతూ, "రాజధానిపై కేంద్రం జోక్యం చేసుకోదని పార్లమెంటులో సంబంధిత మంత్రి వెల్లడించారు. అది రాష్ట్రాలకున్న ప్రత్యేక హక్కు. ఎల్లో మీడియా మాత్రం కేంద్రం ఎలాగైనా అడ్డుకోవాలని కోరుకుంటోంది. దీనిపై వివరణ ఇచ్చిన బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ గారిపై దుష్ప్రచారానికి ఒడిగట్టడం దారుణం" అని వ్యాఖ్యానించారు.

Vijay Sai Reddy
Twitter
GVL Narasimha Rao
  • Error fetching data: Network response was not ok

More Telugu News