Under-19 World Cup: అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్ కు వరుణుడు అడ్డంకి... గెలుపు ముంగిట బంగ్లాదేశ్

  • దక్షిణాఫ్రికాలో అండర్-19 వరల్డ్ కప్
  • టీమిండియా, బంగ్లాదేశ్ మధ్య ఫైనల్ మ్యాచ్
  • విజయానికి 15 పరుగుల దూరంలో బంగ్లాదేశ్
  • వర్షంతో నిలిచిపోయిన మ్యాచ్

దక్షిణాఫ్రికాలోని పోచెఫ్ స్ట్రూమ్ లో టీమిండియా, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా నిలిచిపోయింది. 178 పరుగుల లక్ష్యఛేదనలో బంగ్లాదేశ్ మరో 15 పరుగులు చేస్తే గెలుస్తుందన్న నేపథ్యంలో వరుణుడు ప్రత్యక్షమయ్యాడు. దాంతో మ్యాచ్ ను నిలిపివేశారు. వర్షం వల్ల మ్యాచ్ ఆగిపోయే సమయానికి బంగ్లా 41 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. కెప్టెన్ అక్బర్ అలీ పోరాటపటిమ చూపుతూ 42 పరుగులతో క్రీజులో ఉన్నాడు. అతడికి రకీబుల్ హసన్ నుంచి విశేషమైన సహకారం అందుతోంది. మరో మూడు వికెట్లు తీస్తే విజయం టీమిండియా వశం అవుతుంది.

Under-19 World Cup
India
Bangladesh
Final
  • Loading...

More Telugu News