Janvi kapoor: బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ ఆసక్తికర వ్యాఖ్యలు

  • నా తొలి సినిమా ‘ధడక్’
  • ఇది విడుదలైన తర్వాత నా నటన గురించి అడిగేవారు
  • ఇప్పుడేమో నా పొట్టి దుస్తుల గురించి ప్రస్తావిస్తున్నారు
  • కొంత ఇబ్బందిగా ఉన్నా, వారిని తప్పుబట్టలేము

బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ తొలి చిత్రం ‘ధడక్’. ఈ చిత్రం విడుదలై దాదాపు ఏడాదిన్నర కావస్తోంది. ఐఏఎఫ్ తొలి మహిళా పైలట్ గుంజన్ సక్సేనా బయోపిక్ లో ప్రస్తుతం జాన్వీ నటిస్తోంది. జాన్వీ తదుపరి చిత్రం కోసం అభిమానులు ఎదురు చూస్తున్న తరుణంలో ఆమె ధరించే పొట్టి దుస్తులపై సామాజిక మాధ్యమాల్లో తరచుగా వ్యాఖ్యలు వినబడుతున్నాయి.

ఈ విషయం గురించి ఓ ఇంటర్వ్యూలో జాన్వీని ప్రశ్నించగా, తన తొలి సినిమా ‘ధడక్’ విడుదలైన తర్వాత తన దగ్గరకు వచ్చిన అభిమానులు దీని గురించి, అందులో తన నటన గురించి ప్రశంసలు కురిపించే వారని, ఇప్పుడేమో తన జిమ్ దుస్తుల గురించి ప్రస్తావిస్తున్నారని, ఇది కొంత ఇబ్బందిగా ఉన్నప్పటికీ, వారిని తప్పుబట్టలేమని చెప్పుకొచ్చింది. భవిష్యత్ లో తాను ధరించే దుస్తుల గురించి కాకుండా తన సినిమాల గురించి మాట్లాడుకుంటారని అనుకుంటున్నానని జాన్వీ చెప్పుకొచ్చింది.

Janvi kapoor
Bollywood
Gym looks
short Dresses
  • Loading...

More Telugu News