Gudiwada Amarnath: పవన్ కల్యాణ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎమ్మెల్యే

  • పవన్ కు మూడు ఉన్నాయి, మూడు లేవంటూ విమర్శలు
  • పవన్ కు ఉన్న మూడు ఏంటో ప్రజలందరికీ తెలుసన్న అమర్ నాథ్
  • గత ఎన్నికల్లో జనసేన గ్లాసు బద్దలైపోయిందని వ్యంగ్యం

పవన్ కల్యాణ్ కు 'మూడు లేవు', 'మూడు ఉన్నాయి' అంటూ వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాథ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవన్ కు ఓ సిద్ధాంతం, స్థిరత్వం, వ్యక్తిత్వం అనే మూడు అంశాలు లేవని విమర్శించారు. ఇక పవన్ కు ఉన్న 'మూడు అంశాలు' ఏంటో తాను చెప్పనవసరం లేదని, ప్రజలందరికీ తెలుసని వ్యంగ్యంగా అన్నారు. పవన్ కల్యాణ్ రాజకీయాల్లో అయినా ఉండాలి లేకపోతే సినిమాలు అయినా చేసుకోవాలని హితవు పలికారు. గత ఎన్నికల్లో జనసేన గ్లాసు బద్దలైపోయిందని ఎద్దేవా చేశారు.

Gudiwada Amarnath
Pawan Kalyan
Janasena
YSRCP
Andhra Pradesh
Tollywood
  • Loading...

More Telugu News