cricket: అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్: బంగ్లాదేశ్ ముందు స్వల్ప లక్ష్యం ఉంచిన టీమిండియా
- మొదట బ్యాటింగ్ చేసిన భారత్
- 47.2 ఓవర్లలో 177కు ఆలౌట్
- రాణించిన యశస్వి (88)
బంగ్లాదేశ్ తో అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియా బ్యాటింగ్ ప్రదర్శన నిరాశాజనకంగా సాగింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన భారత్ 47.2 ఓవర్లలో 177 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ తన సూపర్ ఫామ్ ను కొనసాగిస్తూ 8 ఫోర్లు, 1 సిక్సర్ తో 88 పరుగులు చేయడం ఒక్కటే టీమిండియా ఇన్నింగ్స్ లో చెప్పుకోదగ్గ ప్రదర్శన. తిలక్ వర్మ (38), వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ (22) కాస్తోకూస్తో రాణించడంతో భారత్ ఆమాత్రమైనా స్కోరు చేయగలిగింది. బంగ్లాదేశ్ బౌలర్లలో అవిషేక్ దాస్ 3 వికెట్లతో భారత్ ను దెబ్బతీశాడు. షోరిఫుల్ ఇస్లామ్, తాంజిమ్ సకిబ్ రెండేసి వికెట్లతో టీమిండియా పతనంలో పాలుపంచుకున్నారు.