Shakila: మహేశ్ బాబును సోదరుడిగా పేర్కొని... బన్నీ ఎవరో తెలియదన్న షకీలా!

  • నిర్మాతగా మారిన షకీలా
  • తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు
  • ఎన్టీఆర్ గుడ్ డ్యాన్సర్ అంటూ కితాబు

'లేడీస్ నాట్ అలౌడ్' చిత్రంతో నిర్మాతగా అవతారమెత్తిన మలయాళ నటి షకీలా తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్ అగ్రహీరోల గురించి ఒక్క ముక్కలో చెప్పాలని యాంకర్ కోరగా, మహేశ్ బాబును తన బ్రదర్ లాంటివాడని తెలిపింది. జూనియర్ ఎన్టీఆర్ ను మంచి డ్యాన్సర్ అని అభివర్ణించిన షకీలా, ఆశ్చర్యకరంగా అల్లు అర్జున్ గురించి చెప్పమంటే అతడెవరో తనకు తెలియదని చెప్పింది.

బన్నీ ఎవరో నాకు తెలియదు అనడంతో సదరు యాంకర్ కాస్త విస్మయానికి లోనైనా వెంటనే నెక్ట్స్ క్వశ్చన్ కు వెళ్లిపోయాడు. కాగా, షకీలా సమాధానంపై సోషల్ మీడియాలో బన్నీ అభిమానులు నిరసిస్తున్నారు. మరికొందరు మాత్రం షకీలా ఎంతో నిజాయతీగా తనకు పరిచయం లేదన్న కోణంలో చెప్పివుంటుదని అభిప్రాయపడుతున్నారు.

Shakila
Bunny
Allu Arjun
Mahesh Babu
Junior NTR
  • Loading...

More Telugu News