Sachin Tendulkar: ఆసీస్ క్రికెట్ యూనిఫాంలో సచిన్... బ్యాట్ పట్టి మైదానంలో దిగిన మాస్టర్!

  • ఆస్ట్రేలియాలో కార్చిచ్చు విలయం
  • బాధితుల కోసం ఛారిటీ మ్యాచ్ లు
  • మెల్బోర్న్ మైదానంలో సచిన్ సందడి

భారత్ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్నాడు. అక్కడ కార్చిచ్చు ప్రబలడంతో లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. కోట్ల సంఖ్యలో జంతువులు సజీవదహనం అయ్యాయి. ఈ నేపథ్యంలో కార్చిచ్చు బాధితుల కోసం ఛారిటీ క్రికెట్ మ్యాచ్ లు నిర్వహించగా, సచిన్ కూడా మైదానంలో తళుక్కుమన్నాడు. మెల్బోర్న్ లో గిల్ క్రిస్ట్ ఎలెవన్, పాంటింగ్ ఎలెవన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది.

ఈ మ్యాచ్ లో ఇన్నింగ్స్ బ్రేక్ వచ్చినప్పుడు సచిన్ బ్యాట్ పట్టి మైదానంలో దిగి తన బ్యాటింగ్ తో అలరించాడు. ఆసీస్ ట్రేడ్ మార్క్ యూనిఫాం ఎల్లో డ్రస్ లో వచ్చిన సచిన్ మహిళా బౌలర్ ఎలిస్ పెర్రీ బౌలింగ్ లో తన కళాత్మక బ్యాటింగ్ ను ప్రదర్శించాడు. తాను ఫామ్ లో ఉన్న రోజుల్లో ఎంత సులువుగా బంతిని టైమింగ్ చేసేవాడో ఇప్పుడూ అంతే ఈజీగా బంతిని బ్యాట్ కు తాకిస్తూ తన క్లాస్ ను చాటాడు.

Sachin Tendulkar
Australia
Yellow Unifarm
Bushfire
Charity
Melbourne
  • Loading...

More Telugu News