Cpi Ramakrishna: ఏబీ వెంకటేశ్వరరావుపై సస్సెన్షన్ వేటు సరికాదు: సీపీఐ నేత రామకృష్ణ
- కక్ష సాధింపు ధోరణిలా కనిపిస్తోంది
- రాష్ట్ర ప్రభుత్వం ఫ్యాక్షన్ ధోరణితో ముందుకెళ్తోంది
- ప్రభుత్వం తీరుతో అధికారుల్లో అభద్రతా భావం
ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్, ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరావును ప్రభుత్వం సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వంపై సీపీఐ నేత రామకృష్ణ మండిపడ్డారు. వెంకటేశ్వరరావుని సస్పెండ్ చేయడం సబబు కాదని, కక్ష సాధింపు ధోరణిలా కనిపిస్తోందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఫ్యాక్షన్ ధోరణితో ముందుకెళ్తోందని, ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తే అధికారుల్లో అభద్రతాభావం నెలకొంటుందని అన్నారు.