akhilesh yadav: 'అఖిలేశ్ యాదవ్ కనపడుటలేదు' అంటూ పోస్టర్లు

  • సొంత నియోజకవర్గంలోనే అఖిలేశ్ పోస్టర్లు 
  • ముస్లిం మహిళలపై పోలీసుల చర్యలకు ఆగ్రహం 
  • అఖిలేశ్ స్పందించడం లేదని విమర్శలు 

సమాజ్‌ వాదీ పార్టీ అధినేత, యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్  యాదవ్ కనపడుటలేదంటూ కొందరు పోస్టర్లు అంటించారు. ఆయన సొంత నియోజకవర్గంలోనే ఈ పోస్టర్లు అంటించడం గమనార్హం. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టంతో పాటు తీసుకురావాలని చూసిన ఎన్ఆర్‌సీకి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో ముస్లిం మహిళల పట్ల పోలీసుల తీరుపై అఖిలేశ్ ఎందుకు మాట్లాడడంలేదని ఆ పోస్టర్లలో ప్రశ్నించారు. అఖిలేశ్ నోటికి నల్ల బ్యాండు వేసుకున్నట్టు కనపడుతోన్న ఈ పోస్టర్లను కాంగ్రెస్ మైనారిటీ సెల్ అంటించినట్లు తెలిసింది.

ముస్లిం ప్రజల శ్రేయోభిలాషులమని అఖిలేశ్ అంటుంటారని పోలీసు చర్యను ఖండిస్తూ ట్వీట్లు మాత్రమే చేస్తున్నారని, బయటకు వచ్చి మాట్లాడట్లేదని పోస్టర్లలో విమర్శలు గుప్పించారు. గత ఎన్నికలు ముందు అజంగఢ్‌లో అఖిలేష్ పర్యటించిన అఖిలేశ్ మళ్లీ ఇక్కడకు రాలేదని మండిపడ్డారు.

akhilesh yadav
Uttar Pradesh
Congress
  • Loading...

More Telugu News