Newzeland: భారత్ తో రెండో వన్డేలో కివీస్ అద్భుతం...తమ అసిస్టెంట్ కోచ్ తో ఫీల్డింగ్ చేయించిన జట్టు!

  • బౌలర్ సోథీ అనారోగ్యంతో పెవిలియన్ కి చేరిక 
  • జట్టు సబ్ స్టిట్యూట్ లు ఇద్దరూ ఫిట్ గా లేకపోవడం 
  • మైదానంలోకి వచ్చిన అసిస్టెంట్ కోచ్ ల్యూక్ రోంచీ

స్వదేశంలో టీ20లో బోల్తా కొట్టిన న్యూజిలాండ్ జట్టుకు వన్డే సిరిస్ విజయం గొప్ప ఊరటనిచ్చింది. ఓవైపు జట్టులో పలువురు సభ్యులు ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఫీల్డింగ్ కు సబ్ స్టిట్యూట్ కూడా దొరకని పరిస్థితుల్లో రెండో వన్డేలో అద్భుత విజయాన్ని ఆ జట్టు సొంతం చేసుకుని టీ20తో పోయిన పరువును రాబట్టుకుంది. అయితే నిన్న ఉత్కంఠగా భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన రెండో వన్డేలో న్యూజిలాండ్ సీరిస్ ను గెల్చుకోవడమే కాదు ఓ ఆసక్తికర పరిణామానికి తెరలేపింది.

ఈ మ్యాచ్ లో జట్టు అసిస్టెంట్ కోచ్ సబ్ స్టిట్యూట్ ఫీల్డర్ గా మైదానంలోకి అడుగు పెట్టడం ఈ విశేషం. 37వ ఓవర్‌లో బౌలర్ సోథీ అనారోగ్యం కారణంగా తన కోటా ఓవర్లు పూర్తిచేసి పెవిలియన్ కి వెళ్లిపోయాడు. అతని స్థానంలో సబ్ స్టిట్యూట్ గా ఫీల్డింగ్ చేసేందుకు కివీస్ శిబిరంలో ఎవరూ ఫిట్ గా లేరు.

జట్టు సబ్ స్టిట్యూట్స్ కుగేలీన్, శాంట్నర్ అనారోగ్యంతో బాధపడుతుండడంతో అసిస్టెంట్ కోచ్ ల్యూక్ రోంచీ మైదానంలోకి అడుగు పెట్టాడు. అసాధారణ పరిస్థితి ఎదురైనప్పుడు ఇలా కోచ్ లు మైదానంలోకి రావడం గతంలోనూ జరిగాయి. ఇంగ్లండ్-ఆస్ట్రేలియా వార్మప్ మ్యాచ్ లో ఇంగ్లండ్ సహాయ కోచ్ కాలింగ్ వుడ్ ఫీల్డింగ్ చేశాడు.

  • Loading...

More Telugu News