కాలి నడకన తిరుమల చేరుకున్న సమంత, దిల్ రాజు!
- ఇటీవల విడుదలైన 'జానూ'
- స్వామివారి ఆశీస్సుల కోసమే వచ్చాం
- పవన్ చిత్రం ఫస్ట్ లుక్ మార్చిలో
- దర్శనం అనంతరం మీడియాతో దిల్ రాజు
సినిమా హిట్ కావడంతో స్వామివారి ఆశీస్సుల కోసం తిరుమలకు వచ్చినట్టు దర్శనం అనంతరం దిల్ రాజు వ్యాఖ్యానించారు. ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులు ఆదరించారని అన్నారు. సినిమాలో శర్వానంద్, సమంత అద్భుతంగా నటించారని తెలిపారు. పవన్ కల్యాణ్ సినిమా ఫస్ట్ లుక్ ను మార్చిలో విడుదల చేస్తామని, మేలో వేసవి సందర్భంగా సినిమాను రిలీజ్ చేస్తామని చెప్పారు.