Vijay Sai Reddy: సీఎంగా ఉండగా ప్రజాధనంతో ఆ సంస్థకు ప్రయోజనాలు కల్పించాడు: విజయసాయిరెడ్డి

  • కియా కార్ల ఫ్యాక్టరీ తరలిపోతుందంటూ రాయిటర్‌లో రాయించాడు
  • ఇప్పుడు ప్రభుత్వంపైకి ఉసిగొల్పుతున్నాడు
  • అన్ని వ్యవస్థలతో పాటూ మీడియాను భ్రష్టు పట్టించాడు 

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. తప్పుడు వార్తలు రాయిస్తూ అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపణలు గుప్పించారు. కియా సంస్థ తరలిపోతోందంటూ రాయిటర్స్ రాసిన కథనాన్ని ప్రస్తావిస్తూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.

'ఆఖరికి అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్‌ను కూడా మేనేజ్‌ చేసి కియా కార్ల ఫ్యాక్టరీ తరలిపోతుందంటూ వార్త రాయించి పుకార్లు లేవదీశాడు. సీఎంగా ఉండగా ప్రజాధనంతో ఆ సంస్థకు ప్రయోజనాలు కల్పించి ఇప్పుడు ప్రభుత్వంపైకి ఉసిగొల్పుతున్నాడు. అన్ని వ్యవస్థలతో పాటూ మీడియాను భ్రష్టు పట్టించాడు' అని విజయసాయిరెడ్డి విమర్శించారు.

Vijay Sai Reddy
YSRCP
Chandrababu
KIA Motors
  • Loading...

More Telugu News