Visakhapatnam: అయ్యన్నా...మీకిది తగునా : మాజీ మంత్రి దాడివీరభద్రరావు!

  • విశాఖ పరిపాలనా రాజధాని అనగానే సీఎంను అభినందిస్తారనుకున్నా
  • విమర్శలు చేయడం ఎంతవరకు న్యాయం
  • ఉత్తరాంధ్ర అభివృద్ధి మీకు పట్టడం లేదా

'అయ్యన్నపాత్రుడుగారూ...మీకిది తగునా' అని మాజీ మంత్రి, వైసీపీ నాయకుడు దాడి వీరభద్రరావు ప్రశ్నించారు. నిన్న ఆయన తన కార్యాయంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించిన ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిని అభినందించడం పోయి, విమర్శించడం ఈ ప్రాంత నాయకుడిగా మీకు తగదని హితవుపలికారు. ముప్పై ఎనిమిదేళ్లుగా రాజకీయ జీవితంలో ఉంటూ, టీడీపీ నాయకుడిగా పలు పదవులు అనుభవించిన మీరు ఉత్తరాంధ్ర అభివృద్ధి విషయాన్ని విస్మరించడం దారుణమన్నారు.

పైగా సీఎంను పరుష పదజాలంతో విమర్శించడం సభ్యత కాదన్నారు. ఒకే ప్రాంతంలో అభివృద్ధి జరిగితే ఉత్తరాంధ్ర, రాయసీమల్లో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు వచ్చే అవకాశం ఉందని, ఈ విషయాన్ని అయ్యన్న గమనించాలని కోరారు.

Visakhapatnam
AP Capital
dadi veerabhararao
Ayyanna Patrudu
  • Loading...

More Telugu News