Balakrishna: అఘోరాగా కనిపించనున్న బాలయ్య... కాశీ స్మశాన వాటికల్లో షూటింగ్!

  • బాలయ్యతో రెండు హిట్ చిత్రాలు తీసిన బోయపాటి
  • 26 నుంచి మూడో సినిమా షూటింగ్
  • కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్న బోయపాటి

నందమూరి బాలకృష్ణతో దర్శకుడు బోయపాటి తీసిన సింహా, లెజెండ్ ఎంత హిట్ అయ్యాయో అందరికీ తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూడవ చిత్రం షూటింగ్ 26 నుంచి వారణాశిలో జరగనుందని తెలుస్తోంది. ఈ సినిమాలో రెండు కోణాల్లో కనిపించే బాలయ్య, ఓ పాత్రలో అఘోరాగా కనిపిస్తారని టాలీవుడ్ సమాచారం.

వాస్తవానికి ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభం కావాల్సి వుండగా, బాలయ్య లుక్ ను మార్చాలని నిర్ణయించుకున్న బోయపాటి, అందుకోసం మారేందుకు సమయాన్ని ఇస్తూ, కాస్తంత ఆలస్యమైనా ఫిల్మ్ పర్ ఫెక్ట్ గా రావాలని భావిస్తున్నారట. ఇక చిత్రంలో బాలకృష్ణ అఘోరాగా కనిపించే సన్నివేశాలు అత్యంత కీలకమని సినీ వర్గాల సమాచారం. ఇప్పటివరకూ బాలయ్య సరసన నటించే హీరోయిన్లను బోయపాటి ఇంకా ఎంపిక చేయలేదు. త్వరలోనే వీరి ఎంపిక జరుగుతుందని సమాచారం.

Balakrishna
Boyapati Sreenu
New Movie
Shooting
Varanasi
Aghora
  • Loading...

More Telugu News