Disha Pathani: 'సెక్స్ ఇన్ ది బీచ్' అని ప్రశ్నించగానే దిశా పటానీకి చిర్రెత్తుకొచ్చింది!

  • ఇటీవల 'మలంగ్'తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన దిశా పటానీ
  • సినిమా ప్రమోషన్ లో భాగంగా ఇంటర్వ్యూ
  • కూల్ డ్రింక్ గురించి అడిగితే అర్థం చేసుకోలేక ఆగ్రహం

దిశా పటానీ పేరు చెప్పగానే ప్రతి ఒక్కరికీ గుర్తుకు వచ్చేది ఆమె సోషల్ మీడియాలో పెట్టే హాట్ హాట్ ఫోటోలే. సూపర్ హిట్ సినిమాల్లో నటించింది తక్కువే అయినా, ఈ అమ్మడికి ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం ఎక్కువే. ఇటీవల ఆమె ఓ ఇంటర్నేషనల్ ఇన్నర్‌ వేర్ బ్రాండ్‌ కు అంబాసిడర్‌ గా యాడ్ ను కూడా చేసింది. ఆమె ఆదిత్య రాయ్‌ తో కలిసి నటించిన చిత్రం 'మలంగ్' తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రమోషన్ కోసం నిర్వహించిన ఓ కార్యక్రమంలో యాంకర్ అడిగిన ప్రశ్న అర్థం చేసుకోవడంలో పొరపాటు పడిన దిశా పటానీ, ఆమెపై ఆగ్రహాన్ని ప్రదర్శించింది.

ఇంతకీ విషయం ఏంటంటే, సదరు కార్యక్రమంలో ర్యాపిడ్ ఫైర్ లో భాగంగా కొన్ని ప్రశ్నలను యాంకర్ సంధించింది. సముద్ర తీరంలో చాలా రొమాంటిక్ సన్నివేశాల్లో నటించారని గుర్తు చేస్తూ, మరి 'సెక్స్ ఇన్ ది బీచ్'? అని ప్రశ్నించింది. ఈ ప్రశ్న వినగానే దిశాకు చిర్రెత్తుకొచ్చింది. 'సెక్స్ ఇన్ ది బీచ్' అంటే ఓ కూల్ డ్రింక్ పేరని, దాన్ని ఎప్పుడైనా తాగారా? అని యాంకర్ ప్రశ్నించిందని అర్థం చేసుకోకుండా ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని ఇంటర్వ్యూ అనంతరం దిశానే స్వయంగా చెబుతూ క్షమాపణలు వ్యక్తం చేసింది.

  • Error fetching data: Network response was not ok

More Telugu News