Hyderabad: ఒకే ఫ్యాన్ కు ఉరేసుకున్న ఇద్దరమ్మాయిలు!

  • హైదరాబాద్ లో ఘటన
  • తల్లిదండ్రులకు భారమవుతున్నామని మనస్తాపం
  • సూసైడ్ నోట్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు

పక్కపక్క ఇళ్లలోనే ఉంటున్న ఇద్దరు అమ్మాయిలు, ఒకే ఫ్యాన్ కు ఉరివేసుకున్న విషాద ఘటన హైదరాబాద్ శివార్లలోని హయత్ నగర్ లో కలకలం రేపింది. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల్లోకి వెళితే, మహబూబ్ నగర్ జిల్లా పోతునపల్లికి చెందిన మమత, కొంతకాలం క్రితం తల్లిదండ్రులతో కలిసి నగరానికి వచ్చి శ్రీనివాసపురం కాలనీలో నివాసం ఉంటూ ఇంటర్ పూర్తి చేసింది. వారి ఇంటి పక్కనే కర్నూలు జిల్లా మాధవరం ప్రాంతానికి చెందిన గౌతమి, తన తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది. ఇద్దరూ మంచి స్నేహితులుగా మారారు.

గత కొంతకాలంగా వారి వివాహం ఎలా చేయాలన్న విషయమై తల్లిదండ్రులు మధనపడుతూ ఉన్నారు. ఈ క్రమంలో తాము పెద్దలకు భారం అవుతున్నామన్న మనస్తాపంలో పడిన మమత, గౌతమి, తల్లిదండ్రులు ఇంట్లోలేని సమయంలో ఒకే ఫ్యాన్ కు ఉరేసుకున్నారు. తమ చావుకు ఎవరూ కారణం కాదని సూసైడ్ నోట్ రాశారు. దీన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాఫ్తు ప్రారంభించారు.

Hyderabad
Sucide
Girls
Police
  • Loading...

More Telugu News