Sivaji: నేనే అల్లు అరవింద్ కొడుకుని అయ్యుంటే అంత కష్టపడేవాడ్ని కాదేమో!: శివాజీ ఆసక్తికర వ్యాఖ్యలు

  • చిరంజీవి తర్వాత అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టమన్న శివాజీ
  • రజనీకాంత్ స్థాయికి ఎదిగే సత్తా బన్నీకి మాత్రమే ఉందని వెల్లడి
  • సినిమా కోసం బన్నీ పడే కష్టం చూస్తే ఆశ్చర్యం కలుగుతుందని వ్యాఖ్యలు

హీరో శివాజీ చాన్నాళ్ల తర్వాత ఓ మీడియా సంస్థతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు మెగాస్టార్ చిరంజీవి అంటే ఎంతో ఇష్టమని, ఇప్పటి హీరోల్లో అల్లు అర్జున్ ను ఎక్కువగా అభిమానిస్తానని తెలిపారు. దక్షిణాది ఫిలిం ఇండస్ట్రీలో రజనీకాంత్ తర్వాత ఆ స్థాయి అందుకోగలిగే హీరో తన దృష్టిలో బన్నీ ఒక్కడేనని అన్నారు.

'సరైనోడు' సినిమాలో అల్లు అర్జున్ చేసిన క్యారెక్టర్ తనకు ఇష్టమైనదని, ఆ సినిమాను ఎన్నిసార్లు చూశానో లెక్కేలేదని వెల్లడించారు. సినిమా కోసం బన్నీ పడే కష్టం చూస్తే ఆశ్చర్యం వేస్తుందని, తానే గనుక అల్లు అరవింద్ కొడుకును అయ్యుంటే అంతగా కష్టపడేవాడ్ని కాదేమోనని శివాజీ అభిప్రాయపడ్డారు.

Sivaji
Actor
Allu Arjun
Allu Aravind
Rajinikanth
  • Loading...

More Telugu News