Sivaji: పవన్ లా నేనూ సినిమాలు చేసుకుంటా: హీరో శివాజీ

  • ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాడిన శివాజీ
  • ఎవరైనా అవకాశం ఇస్తే మళ్లీ నటిస్తానని వెల్లడి
  • డబ్బులు ఎవరికీ చేదు కాదని వ్యాఖ్యలు

ఏపీకి ప్రత్యేక హోదా కోసం కొన్నాళ్లవరకు పోరాటం చేసిన నటుడు శివాజీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర అంశాలు వెల్లడించారు. రాజకీయాల్లో విరామం లభించడంతో పవన్ కల్యాణ్ సినిమాలు చేస్తున్నారని, ఎవరైనా అవకాశం ఇస్తే తాను కూడా సినిమాలు చేస్తానని చెప్పారు. బతికేందుకు ఇబ్బందేమీ లేదు కానీ, డబ్బులు ఎవరికీ చేదు కాదు కదా? అని వ్యాఖ్యానించారు. గత ఐదారు సంవత్సరాల నుంచి సినిమాల ద్వారా తాను ఒక్క రూపాయి కూడా సంపాదించలేదని తెలిపారు. అయితే, సినిమాలు వదిలేసి పాలిటిక్స్ లోకి వచ్చానని ఎప్పుడూ చింతించలేదని శివాజీ స్పష్టం చేశారు. ఇప్పుడు అవకాశాలు వస్తాయో, రావోనన్న బాధ లేదని, స్నేహితుల ద్వారా వస్తాయని పేర్కొన్నారు.

Sivaji
Pawan Kalyan
Janasena
Cinema
Tollywood
AP Special Status
  • Loading...

More Telugu News