Vellampally Srinivas rao: పవన్ కల్యాణ్ అజ్ఞానంగా మాట్లాడుతున్నారు: మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్

  • ఎన్నికలకు ముందు కర్నూలు రాజధాని చేయమన్నారు
  • తాజాగా కర్నూలుకు హైకోర్టు వస్తే ఉద్యోగాలొస్తాయా? అంటున్నారు  
  • చంద్రబాబుతో లాలూచీపడి పవన్ బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు  

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తడవకో మాట మాట్లాడుతారని, ఇది ఆయన అజ్ఞానానికి నిదర్శనమని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శించారు. ఎన్నికలకు ముందు కర్నూలు రాజధాని కావాలని అడిగిన పవన్ తాజాగా కర్నూలుకు హైకోర్టు వస్తే ఉద్యోగాలు వస్తాయా? అని అంటున్నారని మండిపడ్డారు. ఈ రోజు వెల్లంపల్లి విజయవాడలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శ్రీ భాగ్ ఒప్పందంలో భాగంగా కర్నూలులో హైకోర్టు పెట్టాలని ఉందని ఆయన గుర్తు చేశారు. కర్నూలు అభివృద్ధికి సీఎం జగన్ చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నారన్నారు. చంద్రబాబుతో లాలూచీపడి పవన్ బీజేపీతో పొత్తు పెట్టుకున్నారని విమర్శించారు. చంద్రబాబు మేలుకోసమే పవన్ పనిచేసే వ్యక్తి అని ఆరోపించారు.

చంద్రబాబు వద్ద గుమాస్తాగా పవన్ పనిచేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో దుర్మార్గంగా దోచుకోవడం వల్లే ఒక్క పరిశ్రమ రాలేదన్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ నోళ్ల వెంట ఓకే మాట వస్తుందంటూ.. వాళ్ల భాగస్వామ్యంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారని మంత్రి ప్రశ్నించారు.  

Vellampally Srinivas rao
Minister
Andhra Pradesh
  • Loading...

More Telugu News