Vangaveeti Radha: వారంతా ఎప్పుడైనా వ్యవసాయం చేశారా?: వైసీపీ నేతలపై వంగవీటి రాధ ఫైర్

  • రైతుల దీక్షకు సంఘీభావం ప్రకటించిన టీడీపీ నేత
  • జగన్ లాంటి ముఖ్యమంత్రి దేశంలో ఉండరు
  • మంత్రి బొత్స, వైసీపీ నేతలు తోచినట్లు మాట్లాడుతున్నారు

అమరావతి నుంచి రాజధాని తరలింపును వద్దంటూ అక్కడి రైతులు చేస్తోన్న దీక్షకు టీడీపీ నేత వంగవీటి రాధ సంఘీభావం ప్రకటించారు. ఈ రోజు ఆయన మందడంలో దీక్షకు దిగిన రైతులను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు, మహిళలు 53 రోజులుగా నిరసనలు తెలుపుతూ రోడ్డెక్కినా ప్రభుత్వం మూర్ఖపు పట్టుదలతో ముందుకు పోతోందని విమర్శించారు.

జగన్ లాంటి సీఎం, దేశంలో ఎక్కడా లేరని పేర్కొన్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డి అజేయ కల్లం తోచినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. కేవలం 29 గ్రామాల్లోనే ఉద్యమం ఉందని అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.  రాష్ట్ర ప్రజలంతా అమరావతినే రాజధానిగా కోరుకుంటున్నారన్నారు. రైతుల ఆందోళనపై అవాకులు చెవాకులు మాట్లాడుతున్న ఈ వైసీపీ నేతలు ఎప్పుడైనా వ్యవసాయం చేశారా? అని ప్రశ్నించారు.

Vangaveeti Radha
Telugudesam
Andhra Pradesh
Amaravati
Deeksha
  • Loading...

More Telugu News