Anil Kumar Yadav: జగన్ దృష్టి పెడితే చంద్రబాబు తట్టుకోగలరా?: అనిల్ కుమార్ యాదవ్

  • మేము ఫ్యాక్షనిస్టులమైతే టీడీపీ నేతలు స్వేచ్ఛగా తిరగగలరా?
  • టీడీపీ నేతల మాటలు నమ్మొద్దు
  • అమరావతి రైతులను టీడీపీ నేతలే రెచ్చగొడుతున్నారు

తమ ప్రభుత్వంపై టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. టీడీపీ నేతల మాటలను ప్రజలు నమ్మొద్దని అన్నారు. తెలుగుదేశం పార్టీ నేతలపై ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరించడం లేదని చెప్పారు. తాము ఫ్యాక్షనిస్టులమైతే టీడీపీ నేతలు స్వేచ్ఛగా తిరగగలరా? అని ప్రశ్నించారు. చంద్రబాబు చేసిన అవినీతిపై ముఖ్యమంత్రి జగన్ దృష్టి పెడితే ఆయన తట్టుకోగలరా? అని అన్నారు. అమరావతి రైతులను టీడీపీ నేతలే రెచ్చగొడుతున్నారని విమర్శించారు. అమరావతి రైతులకు జగన్ న్యాయం చేస్తారని చెప్పారు. ప్రతి విషయానికి కోర్టులకు వెళ్లడం టీడీపీ నేతలకు అలవాటేనని దుయ్యబట్టారు.

Anil Kumar Yadav
Jagan
YSRCP
Chandrababu
Telugudesam
Amaravati
  • Loading...

More Telugu News