Mahesh Babu: కొరటాల, మహేశ్ బాబు కాంబినేషన్లో మూడో మూవీ

  • వంశీ పైడిపల్లితో మహేశ్ బాబు తాజా చిత్రం 
  • త్రివిక్రమ్ తో మరో మూవీ చేయాలనే ఉత్సాహం 
  • కొరటాలతో కలిసి హ్యాట్రిక్ హిట్ కొట్టాలనే ఆలోచన

తెలుగు చిత్ర పరిశ్రమలో అపజయమెరుగని దర్శకుల జాబితాలో రాజమౌళి తరువాత కొరటాల శివ పేరు కనిపిస్తుంది. ఆయన దర్శకత్వంలో మళ్లీ చేయడానికి ఒక వైపున ఎన్టీఆర్ ఆసక్తిని చూపుతుంటే, మరో వైపున మహేశ్ బాబు ఉత్సాహాన్ని చూపుతున్నాడు.

మహేశ్ బాబు కథానాయకుడిగా కొరటాల శివ తెరకెక్కించిన 'శ్రీమంతుడు' భారీ విజయాన్ని నమోదు చేసింది. ఆ తరువాత ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన 'భరత్ అనే నేను' కూడా విజయవిహారం చేసింది. ఈ రెండు సినిమాలు కూడా మహేశ్ బాబు రేంజ్ ను పెంచడమే కాకుండా, ఆయన కెరియర్లో చెప్పుకోదగిన చిత్రాలుగా నిలిచిపోయాయి.

అందువలన కొరటాలతో మరో సినిమా చేయడానికి మహేశ్ బాబు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ప్రస్తుతం ఆయన వంశీ పైడిపల్లితో ఒక సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఆ తరువాత సినిమాను ఆయన త్రివిక్రమ్ తో చేయనున్నాడు. ఈ సినిమా పూర్తయిన తరువాత కొరటాలతో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నాడని సమాచారం. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ఈ కాంబినేషన్ సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు వున్నాయి.

Mahesh Babu
Vamsi Paidipalli
Trivikram Srinivas
Koratala Siva
  • Loading...

More Telugu News