New Delhi: ఢిల్లీ ఎన్నికల్లో విషాద ఘటన.... పోలింగ్ బూత్ లో కుప్పకూలిన ఎన్నికల అధికారి

  • ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్
  • హఠాన్మరణం చెందిన ప్రిసైడింగ్ ఆఫీసర్
  • ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే గాల్లో కలిసిన ప్రాణాలు

ఢిల్లీ అసెంబ్లీకి ఇవాళ పోలింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈశాన్య ఢిల్లీలోని ఓ పోలింగ్ బూత్ లో అపశ్రుతి చోటుచేసుకుంది. బాబర్ పూర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ఓ ప్రాథమిక పాఠశాలల్లో విధులు నిర్వర్తిస్తున్న ఎన్నికల అధికారి ఉధమ్ సింగ్ హఠాన్మరణం చెందారు. ప్రిసైడింగ్ ఆఫీసర్ గా వ్యవహరిస్తున్న ఉధమ్ సింగ్ పోలింగ్ జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలడంతో ఇతర సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన చనిపోయారని డాక్టర్లు చెప్పడంతో అక్కడ విషాద వాతావరణం నెలకొంది. గుండెపోటు కారణంగానే ఆ అధికారి చనిపోయినట్టు వైద్యులు తెలిపారు.

New Delhi
Elections
Polling
Presiding Officer
Dead
  • Loading...

More Telugu News