Saidharam Tej: సాయిధరమ్ తేజ్ ట్వీట్ కు సరదాగా బదులిచ్చిన మంచు విష్ణు!

  • సాయిధరమ్ తేజ్ హీరోగా 'సోలో బ్రతుకే సో బెటర్'
  • ప్రచారంలో భాగంగా ఆసక్తికర పోస్టు పెట్టిన సాయిధరమ్ తేజ్
  • ఎన్ని రోజులు ఇలా ఉంటావో చూస్తానంటూ రిప్లయ్ ఇచ్చిన మంచు విష్ణు

మెగా హీరో సాయిధరమ్ తేజ్ ప్రధానపాత్రలో వస్తున్న చిత్రం 'సోలో బ్రతుకే సో బెటర్'. సుబ్బు దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో సాయిధరమ్ తేజ్ సరసన నభా నటేశ్ హీరోయిన్ గా నటిస్తోంది. 'సోలో బ్రతుకే సో బెటర్' చిత్రానికి బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాత. అయితే ఈ చిత్ర ప్రచారంలో భాగంగా సాయిధరమ్ తేజ్ ట్విట్టర్ లో ఆసక్తికరమైన పోస్టు పెట్టారు. లైఫ్ లో సోలోగా ఉంటే కలిగే లాభాలను ఓ జాబితా రూపంలో వెలువరించారు. దీనికి మంచు విష్ణు ఫన్నీగా స్పందించారు.

"తమ్ముడూ సాయిధరమ్ తేజ్, నువ్వింకా ఎన్ని రోజులు సోలోగా ఉంటావో నేనూ చూస్తా" అంటూ సరదాగా కౌంటర్ ఇచ్చారు. "నీ ట్వీట్ ను సేవ్ చేసుకున్నా. సోలో బ్రతుకే సో బెటర్ చిత్రానికి అంతా మంచే జరగాలని కోరుకుంటున్నా" అంటూ మంచు విష్ణు వ్యాఖ్యానించారు. దీనికి సాయిధరమ్ స్పందిస్తూ, "విష్ణు అన్నా, నీలా ప్రతి ఒక్కరూ అదృష్టవంతులు కాలేరన్నా!" అంటూ ట్వీట్ చేశారు.

Saidharam Tej
Manchu Vishnu
Solo Brathuke So Better
Tollywood
  • Loading...

More Telugu News