Chiranjeevi: వచ్చే ఏడాదిలోనే రానున్న చిరూ మూవీ

  • షూటింగు దశలో కొరటాల మూవీ
  • ప్రత్యేక పాత్రలో కనిపించనున్న చరణ్ 
  • అందువల్లనే ఆలస్యంగా విడుదల

మెగా అభిమానులందరి దృష్టి ఇప్పుడు కొరటాల సినిమాపైనే వుంది. కొరటాల దర్శకత్వంలో చిరంజీవి కథానాయకుడిగా ఒక సినిమా రూపొందుతోంది. సందేశంతో కూడిన ఈ వినోదభరిత చిత్రంలో కథానాయికగా త్రిష పేరు వినిపిస్తోంది. ఈ సినిమాను ఈ ఏడాది దసరాకి విడుదల చేయాలని భావించారు. కానీ వచ్చే ఏడాదిలోనే ఈ సినిమాను విడుదల చేసే అవకాశాలు వున్నాయనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది.

 ఈ సినిమాలో చరణ్ ఒక ప్రత్యేకమైన పాత్రలో నటించనున్నాడు. ప్రస్తుతం 'ఆర్ ఆర్ ఆర్' సినిమా చేస్తున్న చరణ్, అదే లుక్ తో కొరటాల సినిమా చేయడం కుదరదు. అంతే కాకుండా 'ఆర్ ఆర్ ఆర్' విడుదల తరువాతనే చరణ్ మరో సినిమా చేయాలనే కండిషన్ అగ్రిమెంట్ లో ఉందట. అందువలన ఆ సినిమా విడుదలైన తరువాతనే కొరటాల సెట్స్ పైకి చరణ్ వస్తాడు. ఈ కారణంగానే ఈ సినిమా షూటింగు ఆలస్యమవుతుందనీ, ఫలితంగా విడుదల వచ్చే ఏడాదిలో వుంటుందనే టాక్ ఫిల్మ్ నగర్లో బలంగా వినిపిస్తోంది.

Chiranjeevi
Charan
Koratala Siva Movie
  • Loading...

More Telugu News