Medaram: మేడారంలో అమరావతి రైతులు.. సీఎం జగన్ మనసు మారాలని మొక్కుల సమర్పణ

  • వనదేవతలకు మొక్కులు సమర్పించిన రైతులు
  • సమ్మక్క, సారలమ్మకు తమ గోడు వినిపించామన్న  మహిళలు
  • ‘జై అమరావతి’ అంటూ నినాదాలు

అమరావతిని రాజధానిగా కొనసాగించాలని కోరుతూ మేడారం అమ్మవార్లకు ఆంధ్రా రైతులు, మహిళలు మొక్కులు సమర్పించారు. మూడు రాజధానులు వద్దనీ, అమరావతినే రాజధానిగా కొనసాగించాలని, సీఎం జగన్ మనసు మార్చాలని కోరుకుంటూ వనదేవతలకు బంగారం (బెల్లం) సమర్పించారు. సమ్కక్క, సారలమ్మకు తమ గోడు వినిపించడం కోసమే ఇక్కడికి వచ్చామని వనదేవతల ఎదుట కన్నీటి పర్యంతమైన రైతులు పేర్కొన్నారు. కాగా, ‘జై అమరావతి’, ‘కాపాడమ్మా కాపాడమ్మా’ అంటూ రైతులు, మహిళలు నినాదాలు చేశారు.

Medaram
Folk festival
Amaravati
Farmers
  • Loading...

More Telugu News