Team India: ఓటమి దిశగా టీమిండియా... సిరీస్ చేజారే అవకాశం!

  • రెండో వన్డేలో కష్టాల్లో పడిన భారత్
  • టార్గెట్ 274 పరుగులు
  • లక్ష్యఛేదనలో 6 వికెట్లు డౌన్

న్యూజిలాండ్ తో రెండో వన్డేలో భారత జట్టు ఓటమి బాటలో పయనిస్తోంది. 274 పరుగుల విజయలక్ష్యంతో బరిలో దిగిన టీమిండియా 31 ఓవర్లు ముగిసేసరికి 153 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కివీస్ బౌలర్లలో హామిష్ బెన్నెట్, టిమ్ సౌథీ చెరో రెండు వికెట్లతో టీమిండియాను దెబ్బతీశారు. శ్రేయాస్ అయ్యర్ (52) ఎప్పట్లానే తనవంతుగా రాణించినా, మిగతా టాపార్డర్ బ్యాట్స్ మెన్ విఫలమయ్యారు. కోహ్లీ 15 పరుగులకే పెవిలియన్ చేరగా, ఓపెనర్ పృథ్వీ షా 24 పరుగులు చేసి అవుటయ్యాడు. మయాంక్ అగర్వాల్ (3), కేఎల్ రాహుల్ (4) స్వల్ప స్కోర్లకే అవుట్ కావడం టీమిండియా అవకాశాలను ప్రభావితం చేసింది.

ప్రస్తుతం క్రీజులో రవీంద్ర జడేజా (18), శార్దూల్ ఠాకూర్ (18) ఆడుతున్నారు. మూడు వన్డేల ఈ సిరీస్ లో న్యూజిలాండ్ ఇప్పటికే తొలి వన్డే గెలిచి 1-0తో ఆధిక్యంలో ఉంది. ఈ రెండో వన్డేలో కూడా గెలిస్తే సిరీస్ వశమవుతుంది.

Team India
Team New Zealand
Auckland
Virat Kohli
ODI
  • Loading...

More Telugu News