Jagan: రాజమహేంద్రవరంలో ‘దిశ’ పోలీస్ స్టేషన్ ని ప్రారంభించిన సీఎం జగన్

  • కార్యక్రమంలో పాల్గొన్న మహిళా మంత్రులు
  • 24 గంటలూ అందుబాటులో దిశ కంట్రోల్ రూమ్  
  • ప్రత్యేక యాప్ ను ప్రారంభించనున్న జగన్  

రాజమహేంద్రవరంలో ‘దిశ’ మహిళా పోలీస్ స్టేషన్ ని సీఎం జగన్ ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో హోం మంత్రి మేకతోటి సుచరిత, పలువురు మహిళా మంత్రులు,  ఏపీఐఐసీ చైర్ పర్సన్ రోజా, డీజీపీ గౌతం సవాంగ్ తదితరులు పాల్గొన్నారు. 24 గంటల పాటు దిశ కంట్రోల్ రూమ్ అందుబాటులో ఉండనుంది. దిశ చట్టానికి సంబంధించి ప్రత్యేక యాప్ ను జగన్ ప్రారంభించనున్నారు. కాగా, మహిళల భద్రత కోసం రాష్ట్ర వ్యాప్తంగా 18 దిశ మహిళా పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. ఇద్దరు డీఎస్పీ స్థాయి అధికారుల పర్యవేక్షణలో 52 మంది సిబ్బంది పని చేస్తారు.

Jagan
YSRCP
Rajamahendravaram
Disha
police station
MLA
Roja
DGP
Gowtam sawang
  • Loading...

More Telugu News