Manish Sisodia: నా ఓఎస్‌డీ అరెస్ట్ సరైనదే.. కఠిన చర్యలు తీసుకోండి: ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి సిసోడియా

  • పన్ను ఎగవేత కేసులో నిందితుల నుంచి లంచం
  • గోపాల్‌కృష్ణను అరెస్ట్ చేసిన సీబీఐ
  •  ఈ వ్యవహారంతో సిసోడియాకు సంబంధం లేదని విచారణలో తేలినట్టు సమాచారం

తన ఓఎస్‌డీ గోపాల్‌కృష్ణ అరెస్ట్ సరైనదేనని, ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా డిమాండ్ చేశారు. అతడి అరెస్ట్ విషయంలో తనకు ఎటువంటి అభ్యంతరం లేదని తేల్చిచెప్పారు. లంచగొండులను శిక్షించాల్సిందేనని అన్నారు. పన్నుఎగవేత కేసులో నిందితుల నుంచి లంచం తీసుకున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న గోపాల్‌కృష్ణను గురువారం అర్ధరాత్రి సీబీఐ అదుపులోకి తీసుకుంది.

ఢిల్లీ ఎన్నికలకు ముందు ఈ పరిణామం తీవ్ర చర్చనీయాంశమైంది. తన ఓఎస్‌డీ అరెస్ట్‌పై తాజాగా స్పందించిన మనీశ్ సిసోడియా.. తాజా వ్యాఖ్యలు చేశారు. లంచం తీసుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని అన్నారు. గోపాల్‌కృష్ణ అరెస్ట్‌పై బీజేపీ తీవ్రంగా స్పందించింది. డిప్యూటీ సీఎం సిసోడియా తరపున లంచం తీసుకుని పట్టుబడ్డారని ఆరోపించింది. అయితే, ఈ వ్యవహారంతో సిసోడియాకు ఎటువంటి సంబంధం లేదని విచారణలో తేలిందని సమాచారం.

Manish Sisodia
New Delhi
OSD Gopalkrishna
CBI
  • Loading...

More Telugu News