Manthena: జగన్ భక్తుడ్నని కాదు, క్రికెట్ బెట్టింగుకు వీరభక్తుడ్నని ప్రకటిస్తే బాగుండేది: మంత్రి అనిల్ పై టీడీపీ ఎమ్మెల్సీ సెటైర్లు

  • చంద్రబాబుపై మంత్రి అనిల్ ఆవేశం
  • జగన్ మూడో కన్ను తెరిస్తే భస్మమైపోతాడని వ్యాఖ్యలు
  • అనిల్ వ్యాఖ్యలపై స్పందించిన సత్యనారాయణరాజు
  • ముందు పోలవరంలో తట్టెడు మట్టి తవ్వి చూపించాలని వ్యంగ్యం

సీఎం జగన్ మూడో కన్ను తెరిస్తే చంద్రబాబు భస్మమైపోతాడని, తాను సీఎం జగన్ కు భక్తుడ్నని ఆవేశం ప్రదర్శించిన మంత్రి అనిల్ కుమార్ పై టీడీపీ ఎమ్మెల్సీ సత్యనారాయణరాజు సెటైర్లు గుప్పించారు. "తాను మంత్రి కంటే ముందే జగన్ భక్తుడ్నని అనిల్ అంటున్నాడు. కానీ అంతకుముందే క్రికెట్ బెట్టింగుకు వీరభక్తుడ్నని ప్రకటిస్తే ఇంకా బాగుండేది. సీఎం జగన్ మూడో కన్ను తెరిస్తే ప్రజలు భస్మం అయిపోతారా..? కొంపదీసి వైఎస్సార్ చనిపోయినప్పుడు జగన్ గానీ మూడో కన్ను తెరిచారా ఏంటి?" అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు.

అంతేకాదు, పూడుస్తాం, పాతేస్తాం అంటూ ఆగ్రహం చూపిస్తున్న అనిల్ కుమార్ మొదట పోలవరం ప్రాజెక్టులో తట్టెడు మట్టి తవ్వి చూపించాలని ఎద్దేవా చేశారు. "శివ అనే వ్యక్తి ఏర్పాటు చేసిన పార్టీని కబ్జా చేసింది ఎవరో చెప్పాలని సీఎం జగన్ ను నిలదీయాలి. ఆ పార్టీ నుంచి బయటికి వచ్చి సొంత పార్టీ పెట్టి తమను గెలిపించాలని సీఎం జగన్ కు సవాల్ విసరాలి" అంటూ అనిల్ కు సూచించారు.

Manthena
Telugudesam MLC
Anil Kumar Poluboina
Jagan
Cricket Betting
  • Loading...

More Telugu News