Mekapati Goutham Reddy: ఏపీ నుంచి కియా పరిశ్రమ ఎక్కడికి వెళ్లదు: మంత్రి మేకపాటి

  • ఏపీ నుంచి ఒక్క కంపెనీ కూడా తరలిపోదు
  • అటువంటి పరిస్థితులు రానివ్వం
  • ఈ దుష్ప్రచారంపై లీగల్ యాక్షన్ ఆప్షన్ ను ‘కియా’ పరిశీలిస్తుంది

అనంతపురంలోని కియా పరిశ్రమ యూనిట్లు పక్క రాష్ట్రానికి తరలిపోతున్నాయంటూ వస్తున్న వార్తలు, ప్రతిపక్షాల విమర్శలు తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి స్పందించారు. ఈరోజు మీడియాతో మాట్లాడుతూ, ఏపీ నుంచి కియా పరిశ్రమ ఎక్కడికీ వెళ్లదని స్పష్టం చేశారు. ఏపీ నుంచి ఒక్క కంపెనీ కూడా తరలిపోదని, అటువంటి పరిస్థితులు రానివ్వమని స్పష్టం చేశారు. పరిశ్రమ స్థాయి, ఉపాధి అవకాశాలను పరిగణనలోకి తీసుకుని ప్రోత్సాహకాలు అందజేయాలన్నది తమ ఆలోచనగా చెప్పారు. కియా తరలిపోతుందన్న దుష్ప్రచారంపై ఆ కంపెనీ లీగల్ యాక్షన్ ఆప్షన్ ను పరిశీలిస్తుందని చెప్పారు.

Mekapati Goutham Reddy
YSRCP
KIA Motors
  • Loading...

More Telugu News