Hyderabad: హైదరాబాదు శివార్లలో విషాదం... ఒకే గదిలో ఇద్దరమ్మాయిలు ఆత్మహత్య

  • రాఘవేంద్ర నగర్ లో ఘటన
  • వారం రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉండగా మమత అనే అమ్మాయి ఆత్మహత్య
  • స్నేహితురాలు గౌతమి సైతం బలవన్మరణం
  • సూసైడ్ నోట్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు

హైదరాబాదు శివార్లలో ఒకే గదిలో గౌతమి, మమత అనే ఇద్దరు అమ్మాయిలు ఆత్మహత్యకు పాల్పడడం తీవ్ర కలకలం రేపింది. హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాఘవేంద్రనగర్ లో ఈ ఘటన జరిగింది. ఆత్మహత్యకు పాల్పడిన అమ్మాయిలిద్దరూ స్నేహితులు. డిగ్రీ చదువుతున్నారు. కాగా, 10 రోజుల్లో మమత పెళ్లి జరగాల్సి ఉంది. అయితే మమత తల్లిదండ్రులు ఓ శుభకార్యానికి వెళ్లగా, సోదరుడు స్కూల్ కు వెళ్లాడు. సోదరుడు తిరిగి వచ్చి చూసేసరికి ఇంటి పైకప్పుకు ఉన్న ఇనుపరాడ్ కు ఉరివేసుకుని మమత, గౌతమి విగతజీవుల్లా కనిపించారు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ప్రాథమికంగా వివరాలు సేకరిస్తున్నారు. కాగా, ఆ ఇద్దరమ్మాయిలు రాసిన సూసైడ్ నోట్ లో ఆసక్తికర వివరాలు ఉన్నాయి. తాము తమ తల్లిదండ్రులకు భారం అయ్యామని, పెళ్లికి భారీగా లాంఛనాలు సమర్పించుకోవాల్సి వస్తోందని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితి మరే యువతికి రాకూడదని తెలిపారు.

Hyderabad
Two Girls
Suicide
Hayatnagar
Raghavendranagar
Police
  • Loading...

More Telugu News