Nirbhaya: అలాంటప్పుడు వారిని ఉరితీయాలనుకోవడం నేరపూరితమైన పాపం అవుతుంది: 'నిర్భయ' కేసులో కోర్టు వ్యాఖ్యలు

  • ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడిన నిర్భయ దోషుల ఉరి
  • మరో కొత్త తేదీ ప్రకటించాలని ఢిల్లీ కోర్టును ఆశ్రయించిన తీహార్ జైలు అధికారులు
  • పిటిషన్ ను కొట్టివేసిన న్యాయస్థానం

నిర్భయ కేసులో దోషులు వరుసగా పిటిషన్లు దాఖలు చేస్తూ ఉరితీత అమలును ఆలస్యం చేస్తున్న నేపథ్యంలో వారిపై డెత్ వారెంట్లు ఇప్పటికి రెండు పర్యాయాలు వాయిదాపడ్డాయి. తొలుత జనవరి 22న ఉరితీయాలనుకున్నా, అప్పటికి దోషుల పిటిషన్లతో సాధ్యం కాలేదు. ఆ తర్వాత ఫిబ్రవరి 1న ఉరికి సర్వం సిద్ధమైనా చివరి నిమిషంలో అదీ వాయిదాపడింది.

దాంతో, నిర్భయ దోషులు నలుగురినీ ఉరితీసేందుకు కొత్త తేదీ ప్రకటించాలని తీహార్ జైలు అధికారులు ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టును కోరారు. ఈ మేరకు దాఖలైన పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. వారు జీవించడానికి చట్టం అనుమతిస్తున్నప్పుడు, వారిని ఉరితీయాలనుకోవడం నేరపూరితమైన పాపం అవుతుంది అని పేర్కొంది. అంతేకాదు, తీహార్ జైలు అధికారులు దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేసింది.

  • Loading...

More Telugu News