Paritala Sunitha: కుమారుడి పెళ్లి శుభలేఖను తిరుమల వెంకన్న పాదాల వద్ద ఉంచిన పరిటాల సునీత!

  • 28న సిద్ధార్థ వివాహం
  • తిరుమలకు వచ్చిన సునీత కుటుంబం
  • స్వామి ఆశీస్సుల కోసమేనని వెల్లడి

దివంగత పరిటాల రవి, మాజీ మంత్రి సునీతల రెండో కుమారుడు సిద్ధార్థ వివాహం, నెల్లూరుకు చెందిన యువతితో నిశ్చయమైంది. ఈ నేపథ్యంలో తిరుమలకు కుటుంబ సమేతంగా వచ్చిన సునీత, వివాహ శుభలేఖను స్వామివారి పాదాల వద్ద ఉంచి ఆశీస్సులు కోరారు. ఆపై ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడిన ఆమె, త్వరలోనే తమ ఇంట్లో మరో శుభకార్యం జరుగనుందని తెలిపారు. తన రెండో కుమారుడి వివాహం 28వ తేదీన జరుగనుందని వెల్లడించారు. కుమారుడి వివాహం సందర్భంగా స్వామిని దర్శించుకునేందుకు వచ్చానని తెలిపారు.

Paritala Sunitha
Sidhartha
Marriage
Tirumala
Wedding Invitation
  • Loading...

More Telugu News