anyamatha pracharam: అన్యమత ప్రచారంపై యువకుడి ఆగ్రహం...పోలీసులకు ఫిర్యాదు చేసిన ప్రచారకులు

  • తమపై పేడ నీళ్లు పోశాడని ఆరోపణ
  • అవి మామూలు నీళ్లే అంటున్న యువకుడు
  • ఎన్నిసార్లు చెప్పినా వినకుండా ప్రచారం చేయడం వల్లేనని వివరణ

అన్యమత ప్రచారం చేయొద్దంటూ ఎన్నిసార్లు చెప్పినా వినకుండా కొనసాగిస్తున్న మత ప్రచారకులపై ఓ యువకుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రచారం చేస్తున్న వారిపై నీళ్లు కుమ్మరించాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో పెట్టడం, అది వైరల్‌ కావడంతో మత ప్రచారకులు సదరు యువకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కృష్ణా జిల్లా గూడురులో చోటు చేసుకున్న ఈ పరిణామంపై పోలీసులు తెలిపిన వివరాలు ఇలావున్నాయి. ప్రచారం చేసుకుంటున్న తమపై పేడనీళ్లు చల్లాడంటూ పట్టణానికి చెందిన యువకుడిపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా అతన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. తాను పేడ నీళ్లు పోయలేదని, అవి మామూలు నీళ్లేనని సదరు యువకుడు వివరణ ఇచ్చాడు. తాను ఎన్నిసార్లు చెబుతున్నా తమ ప్రాంతంలో మత ప్రచారం చేస్తుండడంతో ఆగ్రహం ఆపుకోలేక ఈ పనిచేసినట్లు తెలిపాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

anyamatha pracharam
Krishna District
gooduru
police case
  • Loading...

More Telugu News