President Of India: రాష్ట్రపతిని కలిసిన అమరావతి పరిరక్షణ సమితి నేతలు

  • ఢిల్లీలో పర్యటిస్తున్న అమరావతి పరిరక్షణ జేఏసీ నేతలు
  • అమరావతిని కొనసాగించేలా చొరవ తీసుకోవాలని రాష్ట్రపతికి విన్నపం
  • రైతులు, మహిళల పోరాటాన్ని కోవింద్ దృష్టికి తీసుకెళ్లిన నేతలు

అమరావతి పరిరక్షణ సమితి ఐకాస నేతలు ఢిల్లీలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఢిల్లీలో వారు పలువురు నేతలను కలుస్తున్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని కూడా కలిశారు. తాజాగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తో వారు భేటీ అయ్యారు. ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించేలా చొరవ తీసుకోవాలని, కేంద్ర ప్రభుత్వానికి సూచనలు చేయాలని ఈ సందర్భంగా రాష్ట్రపతికి విన్నవించారు. అమరావతి కోసం రైతులు చేసిన త్యాగాలను వివరించారు. గత 52 రోజులుగా రాజధాని కోసం రైతులు, మహిళలు చేస్తున్న ఆందోళనలను రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లారు.

President Of India
Ram Nath Kovind
Amaravati
  • Loading...

More Telugu News