Balakrishna: బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీ భరత్ కు బ్యాంకు నోటీసులు!

  • టెక్నో యునీక్ ఇన్ ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట రుణం
  • కరూర్ వైశ్యా బ్యాంక్ నుంచి అప్పు తీసుకున్న భరత్, ఆయన కుటుంబీకులు
  • రుణం తిరిగి చెల్లించకపోవడంతో నోటీసులు

బ్యాంకు నుంచి తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించడంలో విఫలమైనందున తెలుగుదేశం పార్టీ నేత, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీ భరత్, ఆయన కుటుంబీకులకు బ్యాంకు నోటీసులు వెళ్లాయి. హైదరాబాద్, అబీడ్స్ లోని కరూర్ వైశ్యా బ్యాంక్ నుంచి, టెక్నో యునీక్ ఇన్ ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట, గతంలో రుణాన్ని తీసుకున్న వీరు, దాన్ని తిరిగి చెల్లించలేదని తెలుస్తోంది.

ఈ విషయంలో వారిని పలుమార్లు సంప్రదించినా, ప్రయోజనం లేకపోయిందని బ్యాంకు వర్గాలు అంటున్నాయి. దీంతో వారికి నోటీసులు పంపించామని, తదుపరి ఆస్తులను జప్తు చేసే కార్యక్రమాలను కోర్టు అనుమతితో ప్రారంభిస్తామని ఓ అధికారి వెల్లడించారు. కాగా, ఈ నోటీసులు శ్రీ భరత్ తో పాటు ఆయన తండ్రి పట్టాభి రామారావు, ఆయన సోదరుడు లక్ష్మణరావు తదితరుల పేరిట జారీ అయినట్టు సమాచారం. బ్యాంకు నుంచి తీసుకున్న అసలు, దానికి వడ్డీ మొత్తం కలిపి 124.39 కోట్లు అయిందని, వెంటనే దాన్ని చెల్లించాలని ఈ నోటీసుల్లో అధికారులు పేర్కొన్నారు.

Balakrishna
Sri Bharat
Bank
Loan
Notice
Karoor Vaisya Bank
  • Loading...

More Telugu News