Nizamabad District: సొసైటీ చైర్మన్ పదవంటే అంతే మరి... రూ. 10.50 లక్షలకు కొనేసిన వైనం!

  • నిజామాబాద్ జిల్లా కమ్మర్ పల్లిలో ఘటన
  • పంటను ఆరబెట్టుకునేందుకు స్థలం కొనేందుకు నిధులు
  • సామ బాపురెడ్డి పరమైన చైర్మన్ పదవి

తెలంగాణలో సహకార సంఘాల ఎన్నికలు జరుగుతూ ఉండగా, నిజామాబాద్‌ జిల్లా కమ్మర్‌ పల్లి మండలం, కోనా సముందర్‌ సొసైటీ చైర్మన్‌ పదవిని రూ.10.50 లక్షలకు ప్రస్తుతం వైస్‌ చైర్మన్‌ గా ఉన్న సామ బాపురెడ్డి దక్కించుకున్నారు. సొసైటీ చైర్మన్ పదవికి పోటీ అధికంగా ఉండటంతో, ఎవరు ఎక్కువ డబ్బులను చెల్లిస్తే, వారికి చైర్మన్ పదవిని ఇవ్వాలని గ్రామస్థులు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

చాలాకాలంగా ఈ ప్రాంతంలో రైతులు, తాము పండించిన పంటలను ఆరబెట్టుకోవడానికి తగిన స్థలం లేదని భావిస్తూ ఉండటంతో, సమీపంలోని గ్రానైట్‌ క్వారీకి చెందిన స్థలాన్ని కొనేందుకు అవసరమైన డబ్బులను ఎవరు ఇస్తే, వారికి చైర్మన్ పదవిని ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో చైర్మన్‌ పదవిని ఆశిస్తున్న బాపురెడ్డి, స్థలం కొనుగోలుకు డబ్బిచ్చేందుకు ముందుకు రావడంతో, చైర్మన్‌ అభ్యర్థిగా గ్రామ రైతులు అతని పేరును ఖరారు చేశారు.

Nizamabad District
Kammarpalli
Society Chairman
Elections
Farmers
  • Loading...

More Telugu News