Kerala: కేరళలో నాలుగో తరగతి పాస్ అయిన 105 ఏళ్ల బామ్మ!

  • పట్టుదలతో సాధించ వచ్చని నిరూపించిన భాగీరథి
  • గణితంలో 75కు 75 మార్కులు
  • ఐదో తరగతి కూడా చదువుతానంటున్న బామ్మ

పట్టుదల ఉంటే సాధించలేనిది ఏమీ ఉండదని మరోమారు నిరూపితమైంది. కేరళకు చెందిన భాగీరథి అనే 105 సంవత్సరాల వృద్ధురాలు నాలుగో తరగతి పరీక్షలు రాసి, ఉత్తీర్ణత సాధించింది. కోల్లామ్ జిల్లాకు చెందిన భాగీరథి, 74.5 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించినట్టు కేరళ అక్షరాస్యత మిషన్ వెల్లడించింది.

మొత్తం 275 మార్కులకు సాగిన పరీక్షలో 205 మార్కులను భాగీరథి పొందారని తెలిపింది. గణితంలో 75 మార్కులకు పరీక్ష సాగగా, భాగీరథి 75 మార్కులనూ తెచ్చుకోవడం గమనార్హం. ఆంగ్లంలో 30 మార్కులకే పరిమితమైనా, తనకు ఆరోగ్యం సహకరిస్తే, ఐదో తరగతి కూడా చదువుతానని ఈమె నమ్మకంగా చెబుతున్నారు. ఇక పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించినందుకు కేరళ ప్రభుత్వ పెద్దలతో పాటు బంధుమిత్రులు భాగీరథిపై ప్రశంసల వర్షం కురిపించారు. 

  • Loading...

More Telugu News