Al-Qaeda: అల్ ఖైదా నేత ఖాసిం అల్ రేమి హతం.. ధ్రువీకరించిన అమెరికా

  • అల్‌ఖైదా కీలక వ్యక్తిగా ఎదిగిన రేమిని
  • యెమన్‌లో అమెరికా జరిపిన దాడుల్లో హతం
  • ఘటన జరిగింది ఎప్పుడన్న విషయాన్ని వెల్లడించని అమెరికా

ఉగ్రవాద సంస్థ అల్ ఖైదా నేత ఖాసిం అల్ రేమి హతమయ్యాడు. అల్ ఖైదాలో నెట్‌వర్క్ దళంలో కీలక వ్యక్తిగా ఎదిగిన రేమిని అమెరికా జవాన్లు కాల్చిచంపారు. యెమెన్‌లో జరిపిన తీవ్రవాద నిరోధకదాడుల్లో అతడు హతమైనట్టు తెలుస్తోంది. దీనిని ధ్రువీకరించిన వైట్‌హౌస్ .. ఈ ఘటన సరిగ్గా ఎప్పుడు జరిగిందన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. రేమిని 2015 నుంచి అల్‌ఖైదాలో పనిచేస్తున్నాడు. మరోపక్క, మారిబ్ నగరంలో జరిగిన డ్రోన్ దాడిలో ఖాసిం హతమైనట్టు గత నెలలోనే వార్తలు హల్‌చల్ చేశాయి.

Al-Qaeda
Yemen
Qasim al Raymi
  • Loading...

More Telugu News