AIIB: సీఎం జగన్ కు ప్రశంసలు... ఏపీకి రుణం ఇచ్చేందుకు ముందుకొచ్చిన ఏఐఐబీ

  • సీఎం జగన్ తో భేటీ అయిన ఏఐఐబీ ప్రతినిధులు
  • ఏపీకి 3 బిలియన్ డాలర్లు రుణం ఇస్తామన్న వెల్లడి
  • తమ ప్రధాన కార్యాలయానికి రావాలంటూ సీఎం జగన్ కు ఆహ్వానం

ఏపీకి రుణం ఇచ్చేందుకు ఆసియా ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంక్ (ఏఐఐబీ) సంసిద్ధత వ్యక్తం చేసింది. ఇవాళ అమరావతిలో ఏపీ సీఎం జగన్ తో ఏఐఐబీ ప్రతినిధులు సమావేశమయ్యారు. కొత్తగా 3 బిలియన్ డాలర్ల రుణం ఇచ్చేందుకు ఏఐఐబీ అంగీకరించింది. ఈ రుణాన్ని ఏపీ ప్రభుత్వం నిర్ణయించుకున్న ప్రాధాన్యతల ప్రకారం ఖర్చు చేసుకోవచ్చని పేర్కొంది. రాష్ట్రంలో పోర్టులు, విమానాశ్రయాలు, సాగునీటి ప్రాజెక్టులకు ఆర్థికసాయం చేస్తామని బ్యాంకు వెల్లడించింది. రోడ్లు, వాటర్ గ్రిడ్ ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేస్తామని తెలిపింది.

ఈ సమావేశం సందర్భంగా ఏపీ సీఎం జగన్ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను బ్యాంకు ప్రతినిధులకు వివరించారు.  నాడు-నేడు కార్యక్రమాన్ని బ్యాంకు ప్రతినిధులు నాలెడ్జ్ మీద పెట్టుబడులుగా ప్రశంసించారు. అంతేకాదు, ఏఐఐబీ ప్రధాన కార్యాలయానికి రావాల్సిందిగా సీఎం జగన్ ను ఆహ్వానించారు. కొత్తగా 3 పోర్టుల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి చెప్పగా, వాటిలో ఒక పోర్టుకు తాము ఆర్థికసాయం అందజేస్తామని బ్యాంకు ప్రతినిధులు సంసిద్ధత వ్యక్తం చేశారు. అంతేకాదు, గోదావరి-కృష్ణా నదుల అనుసంధానానికి కూడా సహకారం అందిస్తామని వెల్లడించారు.

  • Loading...

More Telugu News