Srinivas Reddy: శ్రీనివాస్ రెడ్డికి ఉరి విధించడంతో హాజీపూర్ గ్రామంలో సంబరాలు

  • హాజీపూర్ గ్రామానికి చెందిన శ్రీనివాస్ రెడ్డికి ఉరిశిక్ష
  • ముగ్గురు అమ్మాయిలను అంతమొందించిన శ్రీనివాస్ రెడ్డి
  • కీలక తీర్పు వెలువరించిన పోక్సో న్యాయస్థానం
  • బాణసంచా కాల్చి, మిఠాయిలు పంచుకున్న హాజీపూర్ గ్రామవాసులు

సైకో కిల్లర్ శ్రీనివాస్ రెడ్డికి పోక్సో న్యాయస్థానం ఉరిశిక్ష విధించిన సంగతి తెలిసిందే. నల్గొండ జిల్లా హాజీపూర్ లో కల్పన, శ్రావణి, మనీషా అనే అమ్మాయిలపై అత్యాచారం చేసి హతమార్చిన శ్రీనివాస్ రెడ్డిని న్యాయస్థానం దోషిగా నిర్ధారించింది. శ్రీనివాస్ రెడ్డికి మరణశిక్ష విధించిన నేపథ్యంలో హాజీపూర్ లో సంబరాలు చేసుకున్నారు. గ్రామస్తులు బాధితుల కుటుంబసభ్యులతో కలిసి మిఠాయిలు పంచారు. సంతోషంతో బాణసంచా కాల్చారు. ఊర్లో ఎక్కడ చూసినా పండుగ వాతావరణం కనిపించింది. అయితే శ్రీనివాస్ రెడ్డిని వీలైనంత త్వరగా ఉరితీయాలని గ్రామస్తులు కోరుతున్నారు. బాలికలను దారుణంగా కడతేర్చిన శ్రీనివాస్ రెడ్డికి ఉరిశిక్షే సబబు అని హాజీపూర్ వాసులు ముక్తకంఠంతో అభిప్రాయపడ్డారు.

Srinivas Reddy
Hajipur
Crime
Death
Celebrations
  • Loading...

More Telugu News