KJ Yesudas: ప్రముఖ గాయకుడు కేజే ఏసుదాసు సోదరుడు అనుమానాస్పద మృతి

  • కొచ్చిలో శవమై తేలిన కేజే జస్టిన్
  • కొచ్చి బ్యాక్ వాటర్స్ లో మృతదేహం
  • చర్చికి వెళ్లి తిరిగి రాని కేజే జస్టిన్

ప్రముఖ గాయకుడు కేజే ఏసుదాసు కుటుంబంలో విషాదం నెలకొంది. ఆయన తమ్ముడు కేజే జస్టిన్ కొచ్చిలో శవమై తేలాడు. కొచ్చిలోని బ్యాక్ వాటర్స్ వద్ద జస్టిన్ మృతదేహాన్ని కనుగొన్నారు. ఇక్కడి కంటైనర్ టెర్మినల్ వద్ద ఆయన మృతదేహం నీటిపై తేలుతూ కనిపించింది. పోలీసులు దీన్ని అనుమానాస్పద మృతిగా భావిస్తున్నారు.

 జస్టిన్ చర్చికి వెళ్లొస్తానని చెప్పి తిరిగి రాలేదు. ఎంతకీ ఆచూకీ దొరక్కపోవడంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోదరుడు ఏసుదాస్ మాదిరే జస్టిన్ కూడా సంగీత రంగంలో ఉన్నారు. రచయిత కూడా అయిన జస్టిన్ ఇటీవల కొన్ని పరిణామాల నేపథ్యంలో కుంగిపోయినట్టు చెబుతున్నారు. కొంతకాలం కిందట జస్టిన్ కొడుకు మరణించడం, ఆర్థిక సమస్యలు చుట్టుముట్టడం ఆయన్ను వేదనకు గురిచేసి ఉంటాయని, ఆత్మహత్య చేసుకుని ఉంటాడని కుటుంబసభ్యులు భావిస్తున్నారు.

KJ Yesudas
KJ Justin
Dead
Kochi
Kerala
Police
  • Loading...

More Telugu News