Galla Jayadev: అతనిలో అప్పటికీ, ఇప్పటికీ ఏం మార్పులేదు... అదే ప్రవర్తన!: గల్లా జయదేవ్

  • లోక్ సభలో కియా అంశం ప్రస్తావించిన రామ్మోహన్ నాయుడు
  • అభ్యంతరం వ్యక్తం చేసిన గోరంట్ల మాధవ్
  • గోరంట్ల ఫొటోలతో ట్వీట్ చేసిన జయదేవ్

లోక్ సభలో ఇవాళ కూడా టీడీపీ, వైసీపీ ఎంపీల మధ్య ఆగ్రహావేశాలు చోటుచేసుకున్నాయి. కియా మోటార్స్ ఏపీ నుంచి వెళ్లిపోతోందన్న మీడియా కథనాల నేపథ్యంలో ఈ అంశాన్ని టీడీపీ సభ్యుడు రామ్మోహన్ నాయుడు లేవనెత్తగా, వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ స్పందించారు.

నాడు, ఓ ప్రపంచస్థాయి సంస్థ తొలి వాహనం ఆవిష్కరిస్తున్న సందర్భం కానివ్వండి, నేడు పార్లమెంటులో జరిగిన ఘటన తీసుకోండి... అప్పటికీ ఇప్పటికీ అతనిలో ఏ మార్పులేదు, అదే ప్రవర్తన! అంటూ ట్వీట్ చేశారు. అంతేకాదు, అప్పట్లో గోరంట్ల మాధవ్ కియా సంస్థ ప్రతినిధికి వేలు చూపిస్తున్న ఫొటోతోపాటు, ఇవాళ లోక్ సభలో తన సీట్లోంచి లేచి ఆవేశం ప్రదర్శిస్తున్న ఫొటోను తన ట్వీట్ లో పొందుపరిచారు.

Galla Jayadev
Gorantla Madhav
KIA Motors
Lok Sabha
Rammohan Naidu
Telugudesam
YSRCP
  • Error fetching data: Network response was not ok

More Telugu News